ఈషా ఫౌండేషన్ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో వెల్గటూర్ జట్టు విజేతగా నిలిచింది. విజేతలను స్థానిక ఎస్సై ఉదయ్ కుమార్ శాలువా, జ్ఞాపికలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ… యువత వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడల్లో రాణించాలని కోరారు. త్వరలోనే క్రీడాకారులకు జెర్సీలు అందజేస్తామని హామీ ఇస్తూ, రాబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ గెలిచి వెల్గటూర్ పేరు నిలబెట్టాలని ఆకాంక్షించారు.