వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమం..

తిరుమలాయపాలెం,ప్రజావాణి: తిరుమలాయపాలెం మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మండల పంచాయతీ అధికారి (ఎంపీవో) ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.మండలంలోని గ్రామపంచాయతీలకు చెందిన వార్డు సభ్యులకు మూడు విడతలుగా శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. మొదటి విడతగా మండల పరిధిలోని 15 గ్రామపంచాయతీల వార్డు సభ్యులు ఈ శిక్షణలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామపంచాయతీ వ్యవస్థలో వార్డు సభ్యుల బాధ్యతలు, విధివిధానాలు, గ్రామసభ నిర్వహణ, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలపై...