వార్డు నెంబర్ 8 లో నిలుస్తున్న మురుగునీరు,రోగాల బారిన పడుతున్న స్థానికులు

వార్డు నెంబర్ 8 లో మురుగునీటి అవస్థలు: రోడ్లపైనే ప్రవహిస్తున్న వైనంఅస్తవ్యస్తంగా మారిన రహదారులు: పట్టించుకోని అధికారులుకాలువల మరమ్మతులు కరవు: పోరుమామిళ్ల జూన్7ప్రజావాణి పట్టణంలోని వార్డు నెంబర్ 8 లో అంబేద్కర్ భవన్ వెనుక వైపు ఉన్న నివాస ప్రాంత వీధి అధ్వాన్నంగా మారింది.డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురికి నీరు రోడ్డుపైనే ప్రవహిస్తూ నిలిచిపోతోంది.దీనివల్ల స్థానిక ప్రజలు,నడిచే బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రధాన సమస్యలు రహదారిపై మురుగునీరు: ఇళ్ల నుంచి వచ్చే మురికి నీరు వెళ్లేందుకు సరైన కాలువలు లేకపోవడంతో,ఆ నీరంతా సిమెంట్ రోడ్డుపైనే చెరువులా...