వాణినికేతన్ హైస్కూల్లో భక్తిశ్రద్ధలతో పోచమ్మ బోనాలు
ఇల్లంతకుంట, ఆగస్టు 1 (ప్రజావాణి)రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వాణినికేతన్ హైస్కూల్లో శనివారం పోచమ్మ బోనాల వేడుకలను వైభవంగా నిర్వహించారు.పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పోచమ్మ చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సంప్రదాయ దుస్తులు ధరించిన విద్యార్థినులు భక్తి శ్రద్దలతో బోనాలు ఎత్తుకొనిడప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాల నడుమ నిర్వహించిన ర్యాలీ బస్టాండ్ వరకు సాగింది. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తర్వాత పోచమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ తూముకుంట...