prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 August 2026, 12:19 pm Digital Edition : PRAJA VANI

వాణినికేతన్ హైస్కూల్లో భక్తిశ్రద్ధలతో పోచమ్మ బోనాలు

ఇల్లంతకుంట, ఆగస్టు 1 (ప్రజావాణి)

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వాణినికేతన్ హైస్కూల్లో శనివారం పోచమ్మ బోనాల వేడుకలను వైభవంగా నిర్వహించారు.పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పోచమ్మ చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సంప్రదాయ దుస్తులు ధరించిన విద్యార్థినులు భక్తి శ్రద్దలతో బోనాలు ఎత్తుకొని
డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాల నడుమ నిర్వహించిన ర్యాలీ బస్టాండ్ వరకు సాగింది. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తర్వాత పోచమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేయాలనే లక్ష్యంతో బోనాల వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చదువుతో పాటు సంస్కృతి, ఆచారాల పట్ల అవగాహన పెంపొందించడం కూడా విద్యలో భాగమేనని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ తూముకుంట శ్రీనిధి, ఉపాధ్యాయినీలు సుమంగళి, శోభ, మహాలక్ష్మి, లావణ్య, సునంద, మౌనిక, కళ్యాణి, షమీమా, రేణుక, జలజ, శాంత, పద్మ, స్వాతి, సునీత, ఉష, ఉపాధ్యాయులు శ్రీనివాస్, రాజు, సంతోష్, రమేష్, తిరుపతి తదితరులు, పాల్గొన్నారు.