వలకు చిక్కుకొని మత్స్యకారుడు మృతి
గోరి కొత్తపల్లి మండల కేంద్రానికి చెందిన కట్ల సతీష్ (33) చేపలు పడుతున్న క్రమంలో మరణించారు. జీవన ఉపాధిలో బాగంగా గ్రామ బొక్కి చెరువులో చేపల పట్టానికి వెళ్లగా..చెరువులో వలకు సతీష్ కాలు చిక్కుకొని ప్రాణాలు వదిలినట్లు స్థానికులు పేర్కొన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన సతీష్ మృతి తో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సతీష్ కు ఇద్దరు కూతుర్లు, భార్య ఉన్నారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు