వర్షాల్లో భవన నిర్మాణ పనులు ప్రమాదకరం కార్మికులు జాగ్రత్త
పాత గోడలు, శిథిల నిర్మాణాల వద్ద పనులు చేయవద్దు కార్మికుల భద్రతకు యజమానులే బాధ్యత వహించాలి: చిలువేరు స్వామి పెద్దపల్లి జూలై 29 ప్రజావాణి: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని భవన నిర్మాణ కార్మిక సమైక్య సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు చిలువేరు స్వామి పిలుపునిచ్చారు. వర్షాల కారణంగా నిర్మాణ స్థలాల్లో అకస్మాత్తుగా ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నందున, ప్రతి ఒక్కరూ భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు....