బెజ్జంకి, జూలై 20 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ళ గ్రామంలో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామ ప్రజలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా గ్రామ పంచాయతి కార్యదర్శి కొంపల్లి వంశీధర్ ఆధ్వర్యంలో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు పాల్గొని రహదారులకు ఇరువైపుల పెరిగిన గడ్డి, చెత్తను తొలగించి శుభ్రపరిచారు.దీంతో గ్రామంలో దోమల పెరుగుదల, చెత్త వల్ల కలిగే సీజనల్ వ్యాధులను నివారించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.ఈ సందర్భంగా కార్యదర్శి కొంపల్లి వంశీధర్ మాట్లాడుతూ, గ్రామ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పరిశుభ్రతే ఆరోగ్యానికి మొదటి మెట్టు అని పేర్కొన్నారు.