prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 8:18 am Digital Edition : PRAJA VANI

వర్షపు నీటి ఇంకుడు గుంతల నిర్మాణం తప్పనిసరి<br>

*వర్షపు నీటి ఇంకుడు గుంతల నిర్మాణం తప్పనిసరి*

*పట్టణ మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు*

* *మన ప్రజావాణి* మందమర్రి:- జులై 17

పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని 300 చదరపు గజాలు లేదా అంతకంటే ఎక్కువ స్థలం ఉన్న ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న
జల్ సంచయ్ – జల్ భాగీధారి కార్యక్రమంలో భాగంగా  వర్షపు నీటి సంరక్షణ ఇంకుడు గుంతలు తప్పనిసరిగా నిర్మించాలని పట్టణ మున్సిపల్ కమీషనర్ తుంగపిండి రాజలింగు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. భూగర్భ జలాల మట్టాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కార్యక్రమం కింద ప్రతి అర్హత గల భవన ఆవరణలో తగిన ప్రమాణాలతో ఇంకుడు గుంతలు నిర్మించాలని సూచించారు. పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని 300 చ.గజాలు లేదా అంతకంటే ఎక్కువ స్థలం ఉన్న గృహాలు, అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాలు, ఇతర సంస్థలు వర్షపు నీటి సంరక్షణ ఇంకుడు గుంతలు తప్పనిసరిగా నిర్మించాలని స్పష్టం చేశారు. మున్సిపల్ అధికారులు నిర్వహించే తనిఖీల సమయంలో ఇంకుడు గుంతలు నిర్మించని భవన యజమానులపై ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. భూగర్భ జలాల పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు.