prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 11:35 am Digital Edition : PRAJA VANI

వర్షంలోనూ సేవలో ముందున్న సుందిల్ల సర్పంచ్

వర్షంలోనూ సేవలో ముందున్న సుందిల్ల సర్పంచ్

రామగిరి,జూలై 30

రామగిరి మండలం సుందిల్ల గ్రామంలోని నరసింహ నగర్‌లో కురిసిన భారీ వర్షాలకు ఓ భారీ వృక్షం రోడ్డుపై కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే గ్రామ సర్పంచ్ ముస్కుల నరేందర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది,గ్రామస్థులతో కలిసి చెట్లను ముక్కలుగా కోసి రోడ్డుపై నుంచి తొలగించారు.చెట్టు కొమ్మలు విద్యుత్ లైన్లపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ,విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించారు.సమిష్టి కృషితో కొద్దిసేపటికే రోడ్డును పూర్తిగా శుభ్రం చేసి రాకపోకలను పునరుద్ధరించారు.వర్షం మధ్యలోనూ ప్రజల ఇబ్బందులను గుర్తించి వెంటనే స్పందించిన సర్పంచ్ ముస్కుల నరేందర్ రెడ్డి,విద్యుత్ శాఖ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది సేవలను గ్రామస్థులు అభినందించారు.