వరి కొయ్యల మంటలతో తప్పిన భారీ ప్రమాదం- విద్యుత్ అధికారుల అప్రమత్తతతో సబ్‌స్టేషన్‌కు ముప్పు తప్పింది
బెజ్జంకి, జూన్ 2(ప్రజావాణి ) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తి వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో మంటలు వ్యాపించి విద్యుత్ సబ్‌స్టేషన్ ఆవరణ వరకు చేరుకున్నాయి. ప్రమాదాన్ని గుర్తించిన విద్యుత్ లైన్‌మెన్ మల్లయ్య వెంటనే స్పందించి, తన ఆదేశాల మేరకు మంటలు వ్యాపిస్తున్న ప్రాంతానికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అనంతరం మంటలు సబ్‌స్టేషన్ సమీపానికి చేరుకోగానే గ్రామ సర్పంచ్ మల్లయ్య, విద్యుత్ శాఖ అధికారులు, జూనియర్ లైన్‌మెన్ నరేష్, వి.డబ్ల్యూ. శ్రావణ్, సబ్‌స్టేషన్ ఆపరేటర్ రాజు, గ్రామ యువకులు,...