prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 June 2026, 3:49 pm Digital Edition : RAJASHEKARREDDY

“వరి కొయ్యలకు నిప్పు.. అప్రమత్తతతో తప్పిన భారీ ప్రమాదం “విద్యుత్ అధికారులు, సర్పంచ్, గ్రామ యువకుల సకాల స్పందన

 

బెజ్జంకి, జూన్ 2 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తి వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో మంటలు తీవ్రంగా చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించి సమీపంలోని గడ్డికట్టలు, విద్యుత్ పైపులు, వైర్లు దెబ్బతిన్నాయి. మంటలు సబ్‌స్టేషన్ ఆవరణ వస్తున్న సమాచారం అందుకున్న వెంటనే గుగ్గిళ్ల లైన్‌మెన్ మల్లయ్య, గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య, జేఎల్‌ఎం నరేష్,వీఈడబ్ల్యు శ్రావణ్ సబ్‌స్టేషన్ ఆపరేటర్‌ రాజు తో పాటు గ్రామ యువకులు, రైతులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
సకాలంలో స్పందించి మంటలను ఆర్పివేయడంతో ఎలాంటి ప్రాణనష్టం,ఆస్తి నష్టం జరగలేదని తెలిపారు.అయితే గుర్తుతెలియని వ్యక్తి ఉద్దేశపూర్వకంగా వరి కొయ్యలకు నిప్పు పెట్టిన ఘటనపై గ్రామంలో ఆందోళన నెలకొంది.ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, రైతులు అధికారులను కోరుతున్నారు. మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.