వరికుంట్ల గ్రామంలో అరటి తోటలకు నిప్పు పెట్టిన దుండగుడు – ₹20 లక్షల వరకు నష్టం !

కడప జిల్లా ప్రజావాణి జూన్ 18 వరికుంట్ల,గ్రామం జ్యోతి కి వెళ్లే దారి చెక్పోస్ట్ సమీపమున భూవివాదం నేపథ్యంలో ఒక వ్యక్తి చేసిన దౌర్జన్యం వరికుంట్ల గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. "ఇది నా పొలం" అంటూ ఒక దుండగుడు తోటకు నిప్పు పెట్టడంతో,సుమారు 10 ఎకరాల్లో విస్తరించి ఉన్న అరటి తోటలు, ఖరీదైన డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.ఈ ఘోర ప్రమాదంలో సుమారు రూ. 10 లక్షల నుండి రూ. 20 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు....