వరంగల్ వేయి స్తంభాల గుడిలో అర్చకుల భారీ సమావేశం: సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హామీ

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి జులై 16(ప్రజావాణి): వరంగల్ లోని చారిత్రాత్మక వేయి స్తంభాల దేవాలయంలో అర్చక జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ ఆధ్వర్యంలో వివిధ జిల్లాల ధూప దీప నైవేద్య (డిడిఎన్) అర్చకుల ప్రాంతీయ సమావేశం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సమావేశానికి జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్ల, ఖమ్మం తదితర జిల్లాల నుండి అర్చకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉమ్మడి వెల్గటూర్, ఎండపల్లి మండలాల అధ్యక్షులు పర్వతగిరి...