prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 March 2026, 12:27 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

వన్యప్రాణుల దాహం తీరుస్తూ నేస్తం సేవా సంస్థ ముందడుగు

ప్రజావాణి; కడప జిల్లా, మైదుకూరు  వన్యప్రాణుల దాహార్తిని తీరుస్తూ… నేస్తం సేవా సంస్థ ముందడుగు!మండుతున్న ఎండలు.. అగ్నిగుండంలా మారుతున్న అడవి.ఈ వేసవిలో మూగజీవాల కడుపు నిండా నీరు, గుక్కెడు దాహం తీర్చే దిశగా నేస్తం సేవా సంస్థ గత పది సంవత్సరాలుగా మా ప్రయాణాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నాం.కడప జిల్లా, మైదుకూరు మండలం మరియు బ్రహ్మంగారి మఠం మండలంలోని నల్లమల అభయారణ్యం పరిధిలోని ‘ఎద్దు అడుగు కణం’, ‘మిట్టమాను పల్లె’ నుంచి బ్రహ్మంగారి మఠం వెళ్లే అటవీ మార్గం. నందు..గతంలో మేము ఏర్పాటు చేసిన నీటి తొట్టెలను కొందరు అకతాయిలు పగలగొట్టడం, దొంగిలించడం వంటి పనులు చేసినప్పటికీ, వన్యప్రాణుల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదని భావించి.. ఈ ఏడాది కూడా కొత్త నీటి తొట్టెలను ఏర్పాటు చేశాము.ఈ వేసవిలో వన్యప్రాణులకు ఎలాంటి ఆటంకం కలగకూడదని ఆకాంక్షిస్తూ.. ఈ రోజు కొత్తగా ఏర్పాటు చేసిన నీటి తొట్టెలకు సాంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించి, పూలమాలలు వేసి, కొబ్బరికాయలు కొట్టి శాస్త్రోక్తంగా నీటిని నింపడం జరిగింది. కేవలం జంతువులకే కాకుండా, పక్షుల కోసం కూడా ప్రత్యేకంగా చిన్న చిన్న కుండీలను ఏర్పాటు చేశాము.మూగజీవాల తోట్లకు సహకరించిన దాతలు విష్ణు వర్ధన్ రెడ్డి, సన్నేపల్లి సునీల