prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 3:59 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

వడదెబ్బ నివారణకు ఉచిత హోమియో మందులు పంపిణీ*

ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణి న్యూస్ (మే 07) నందిగామ పట్టణం గురువారం ఉదయం గాంధీ సెంటర్లో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వడదెబ్బ నివారణకు ఉచిత హోమియో మందులు పంపిణీ ముఖ్యఅతిథిగా పాల్గొన్న బార్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది షేక్ కరీముల్లా నందిగామ పట్టణం గురువారం ఉదయం గాంధీ సెంటర్లో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బొందలపాటి పార్వతి జ్ఞాపకార్థం వారి కుమారుడు బందలపాటి నరసింహారావు (ప్రముఖ న్యాయవాది) ఉచిత హోమియో మందులు పంపిణీ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నందిగామ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది షేక్ కరీముల్లా పాల్గొని ప్రజలకు హోమియో మందులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కరీముల్లా మాట్లాడుతూ వేసవికాలంలో ప్రజల ఆరోగ్య భద్రత కోసం న్యాయవాది వందలపాటి నరసింహారావు ముందుకు రావడం అభినందియమని అన్నారు.పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అవసరమని తెలిపారు.ఈ కార్యక్రమంలో నందిగామ ప్రముఖులు పాల్గొన్నారు.