లయన్స్ క్లబ్ ఆఫ్ ఘట్‌కేసర్ సమావేశం – ద్వితీయ ఇన్‌స్టాలేషన్ కార్యక్రమంపై విస్తృత చర్చ
ఘట్‌కేసర్, జూలై 9: లయన్స్ క్లబ్ ఆఫ్ ఘట్‌కేసర్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సమావేశంలో రానున్న ద్వితీయ ఇన్‌స్టాలేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై సభ్యులు విస్తృతంగా చర్చించారు. క్లబ్ చార్టర్ అధ్యక్షుడు సారా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, రాబోయే ఇన్‌స్టాలేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రతి సభ్యుడి అభిప్రాయాన్ని గౌరవిస్తూ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. కాబోయే అధ్యక్షుడు రేసు లక్ష్మారెడ్డి, కార్యదర్శి బచ్చు నాగేష్ కుమార్ గుప్తా, ఉపాధ్యక్షుడు బచ్చు ప్రమోద్ గుప్తా ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి లయన్స్ జిల్లా 320ఎఫ్ నుండి...