prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 April 2026, 2:59 pm Digital Edition : RAJASHEKARREDDYBEJJANKI BEJJANKI

లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న కేంద్రమంత్రి బండి సంజయ్

లక్ష్మీనరసింహస్వామిని దర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

బెజ్జంకి, ఏప్రిల్హో 5(ప్రజావాణి )

 

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదివారం సిద్దిపేట జిల్లా బెజ్జంకిలోని లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, దేశ ప్రజల శాంతి, సౌభాగ్యం కోసం ప్రార్థనలు చేశారు.
దేవాలయానికి చేరుకున్న మంత్రి బండి సంజయ్‌కు స్థానిక నాయకులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ఆర్చకులు వేద మంత్రాలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చేర్మెన్ జెల్ల ప్రభాకర్, రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు కరివేద మైపాల్ రెడ్డి,బీజేపీ మండల అధ్యక్షులు కోలిపాక రాజు తదితరులు పాల్గొన్నారు.