*ఉపాధి హామీ జాబ్ కార్డుల తొలగింపు*
ప్రజావాణిలో బాధితుల ఫిర్యాదు- విచారణకు విచ్చేసిన అధికారులు
కార్డులు పునరుద్దరిస్తామని అధికారుల హామీ
బెజ్జంకి,మార్చి 30(ప్రజావాణి):
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలోని పలువురి ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబ్ కార్డులను చనిపోయారని నమోదు చేసి తొలగించరాని బాధితులు గత సోమవారం బాధితులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.ఫిర్యాదుపై స్పందించిన అధికారులు సోమవారం గ్రామాన్ని సందర్శించి విచారణ చేపట్టారు.ఈ సందర్భంగా పీఆర్డిఏ శ్రీనివాస్ గౌడ్, పి ఆర్ డి సురేష్, ఎంపీడీఓ ప్రవీణ్, ఏపీవో రాములు,టిఏ నవీన్ లు గ్రామానికి చేరుకుని బాధితుల నుండి వివరాలు సేకరించారు.జాబ్ కార్డులను ఎవరు తొలగించారో వివరాలు తెలియజేయాలని ఈ సందర్బంగా గ్రామస్తులు కోరారు.అధికారులు స్పందిస్తూ తొలగించిన జాబ్ కార్డులను మళ్లీ పునరుద్ధరించి లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు.బాధితులు తమ డిమాండ్లను వెల్లడిస్తూ,జాబ్ కార్డులను యథావిధిగా పునరుద్ధరించడంతో పాటు ఉపాధి హామీ పనులను వెంటనే పునఃప్రారంభించాలని కోరారు.అలాగే భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.