లక్ష్మీనరసింహ స్వామి కాలనీవాసులకు కాంగ్రెస్ సీనియర్ నేత సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి భరోసా… కాలనీ సమస్యల పరిష్కారానికి సొంత నిధులైనా ఖర్చు చేస్తా
ఘట్‌కేసర్, ఆగస్టు 1: ప్రజా సమస్యల పరిష్కారంలో ఆలస్యం సహించబోనని, అవసరమైతే తన సొంత నిధులతోనే కాలనీ అభివృద్ధి పనులు చేపడతానని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, 'రేవంత్ అన్న టీం' సభ్యుడు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్ లక్ష్మీనరసింహ స్వామి కాలనీ వాసులు శనివారం ఎస్‌బీఆర్ ఏసీ కన్వెన్షన్ హాల్‌లో శ్రీకాంత్ రెడ్డిని కలిసి కాలనీలో నెలకొన్న సమస్యలను వివరించారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ లేక మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోందని, సీసీ రోడ్లు లేక స్వల్ప వర్షానికే బురద...