prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 May 2026, 11:51 pm Digital Edition : GIRIBABU KONDHURG

*లక్ష్మీదేవి లక్కీ చాన్స్.. సాధించిన శంకరుడు..*   *లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ భూసేకరణకు రూ. 587 కోట్ల కేటాయింపు..* 

*లక్ష్మీదేవి లక్కీ చాన్స్.. సాధించగంగను తేనున్న మీ సేవకు…

 

లక్ష్మీదేవి పల్లి రైతాంగానికి “లక్కీ ఛాన్స్” సాధించిన వీర్లపల్లి శంకర్

 

లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ భూసేకరణకు రూ.587 కోట్లు కేటాయింపు

 

ప్రకటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

 

షాద్‌నగర్ రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మరోసారి తన పట్టుదల ఏంటో నిరూపించారు. ఎన్నో ఏళ్లుగా రైతులు ఎదురుచూస్తున్న కేపీ లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్‌కు రూపురేఖలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.

 

పట్టు వదలని విక్రమార్కుడిలా సమస్యను భుజాన వేసుకుని మంత్రులను, అధికారులను, ముఖ్యమంత్రిని వరుసగా కలుస్తూ రిజర్వాయర్ అంశంపై నిరంతరం కృషి చేశారు. ఆ పట్టుదల ఫలితంగానే తొలి విడతగా భూసేకరణ కోసం రూ.587 కోట్ల నిధులు కేటాయిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.

 

ఈ నిర్ణయంతో లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మాణానికి స్పష్టత రావడమే కాకుండా, నియోజకవర్గ రైతాంగంలో కొత్త ఆశలు చిగురించాయి. మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపించే నాయకుడిగా వీర్లపల్లి శంకర్ మరోసారి తనదైన ముద్ర వేశారు.

 

సాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న వేలాది ఎకరాలకు ఈ ప్రాజెక్ట్ వరప్రసాదంగా మారనుంది. రైతుల కళ్లలో ఆనందం నింపే దిశగా శంకర్ చేస్తున్న కృషి ఇప్పుడు ప్రజల్లో ప్రశంసలు అందుకుంటోంది.

 

ఆనాటి శంకరుడు గంగను జటాలలో నుంచి భూమికి వదిలినట్లే…

ఈనాటి శంకర్ రైతుల పొలాలకు నీటి గంగను తీసుకురావడానికి కృషి చేస్తున్నారు.

 

వీర్లపల్లి శంకర్ అప్రతిహత విజయయాత్రలో ఇది మరో మైలురాయి…

అన్నదాతల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే నిర్ణయం…

 

శంకరన్నా… హాట్సాఫ్!