లక్ష్మాపూర్ ఆరేపల్లి రోడ్డుకు మోక్షం ఎప్పుడో
లక్ష్మాపూర్ నుండి ఆరేపల్లి వరకు రోడ్డు నిర్మించాలని మండల అభివృద్ధి అధికారికి సర్పంచుల వినతి రామాయంపేట, జూలై 28: లక్ష్మాపూర్ నుండి ఆరేపల్లి తండా (దంతేపల్లి) వరకు ఉన్న రహదారి తీవ్ర గుంతలతో ప్రమాదకరంగా మారిందని క్యాట్రియాల్, దంతేపల్లి సర్పంచులు స్రవంతి రాజేంద్రగుప్త, మస్కూరి బాలరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఆరు గ్రామ పంచాయతీల మీదుగా కామారెడ్డికి వెళ్లే ఈ రోడ్డును పంచాయతీరాజ్ నుండి ఆర్ అండ్ బీ పరిధిలోకి మార్చాలని కోరుతూ ఎంపీడీవో షాజలోద్దీన్కు సోమవారం వినతిపత్రం అందజేశారు. రోడ్డు నిర్మాణానికి...