లంచాల సుడిగుండంలో కాశినాయన రెవెన్యూ: కలెక్టర్ నివేదికను తొక్కిపెట్టి..ఆర్మీ పేరుతో సావిశెట్టిపల్లె (అక్కంగుండ్ల)ఇట్టుకులపాడుపేదల భూములపై గతంలో కాశినాయన మండలం ఎమ్మార్వో వెంకటసుబ్బయ్య కక్కుర్తి!

అధికారం చేతిలో ఉంది కదా అని చట్టాన్ని చుట్టంగా మార్చుకుంటే ఏమౌతుంది? నిబంధనలను తుంగలో తొక్కి,ఉన్నతాధికారుల ఆదేశాలనే కాలరాస్తే వ్యవస్థ ఎలా భ్రష్టు పడుతుంది? దీనికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది కాశినాయన జూలై 02 ప్రజావాణి మండలంలోని సావిశెట్టిపల్లె (అక్కంగుండ్ల) ఇట్టుకులపాడు భూ వివాదంలో గ్రామ పరిధిలో దశాబ్దాలుగా పేద ప్రజలు సాగు చేసుకుంటూ,తమ నోటి కూడు సంపాదించుకుంటున్న విలువైన భూమిపై కొందరు అధికారులు కాటేయాలని చూస్తున్నారు.గతంలో కాశినాయన ఎమ్మార్వో వెంకటసుబ్బయ్య లంచాల కక్కుర్తికి లొంగిపోయి,ఉన్నతాధికారుల నివేదికలను పక్కనబెట్టి, క్షేత్రస్థాయి వాస్తవాలను సమాధి చేస్తూ...