లంచగొండి వీఆర్వోలను సస్పెండ్ చేస్తే సరిపోదు.శాశ్వతంగా డిస్మిస్ చేయాలి! నేషనల్ హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ కవలకుంట్ల మధుబాబు డిమాండ్ చేశారు

రెవెన్యూ శాఖలో లంచాల చీడపురుగులు.సామాన్యుల రక్తం తాగుతున్న అవినీతి తిమింగలాలు!పుల్లవీడు వీఆర్వో సునీతపై కేవలం సస్పెన్షన్ వేటు వేస్తే సరిపోదు కవలకుంట్ల మధుబాబు! అవినీతిపై తిరగబడండి.. ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 14400 కు ఫిర్యాదు చేయండి!  పోరుమామిళ్ల (జులై 23 ప్రజావాణి)భూమి మ్యుటేషన్ కోసం ఒక సామాన్య రైతును రూ.2 లక్షల భారీ లంచం డిమాండ్ చేస్తూ,వాట్సప్ చాటింగ్‌తో అడ్డంగా దొరికిపోయిన పుల్లవీడు వీఆర్వో సునీతను కేవలం సస్పెండ్ చేయడం కంటితుడుపు చర్యేనని,ఆమెను తక్షణమే ఉద్యోగం నుండి శాశ్వతంగా డిస్మిస్ (తొలగించడం) చేయాలని...