వై.ఎస్.ఆర్ కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్18) ప్రొద్దుటూరు రూరల్ సి.ఐ. శ్రీ ఎం. నాగ భూషణ్ గారు రౌడీ షీటర్లను సత్ప్రవర్తనతో మెలగాలని హెచ్చరించారు. జిల్లా ఎస్.పీ. శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్,ఐపీఎస్ ఆదేశాల మేరకు, ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు మరియు చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులకు శనివారం ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ప్రొద్దుటూరు ఎ.ఎస్పీ విబు కృష్ణ ఐ.పి.ఎస్ గారు కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా సి.ఐ.మాట్లాడుతూ, నేర ప్రవృత్తిని విడిచి సమాజంలో మంచి నడవడికతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని సూచించారు. నేరాలు చేయడం వల్ల కుటుంబ సభ్యులు కూడా సమాజంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.రౌడీ షీటర్” అనే ముద్ర తమ పిల్లల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని గ్రహించాలని సూచించారు. నేర ప్రవృత్తిని మార్చుకునేందుకు ఒక అవకాశం ఇస్తున్నామని, మార్పు లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే ఆసాంఘిక కార్యక్రమాలు, గొడవలు, దౌర్జన్యాలు, వివాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రవర్తనలో మార్పు లేకపోతే పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు రూరల్ సి.ఐ ఎం. నాగభూషణ్, ఎస్.ఐ లు శ్రీకాంత్, రాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు.జిల్లా పోలీస్ కార్యాలయం, కడప.