“రౌడీ షీటర్లకు పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్ “తిరిగి నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ కింద చర్యలు : సీఐ విద్యాసాగర
బెజ్జంకి, మే 26 (ప్రజావాణి): సిద్దిపేట జిల్లా బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లతో పోలీసులు ప్రత్యేక సమావేశం నిర్వహించి కౌన్సెలింగ్ ఇచ్చారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సిద్దిపేట రూరల్ సర్కిల్ సీఐ చి. విద్యాసాగర్, బెజ్జంకి ఎస్‌ఐ తోట తిరుపతి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. గ్రామాల్లో శాంతి భద్రతలకు భంగం కలిగించే ఎటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడవద్దని అధికారులు స్పష్టం చేశారు. గ్రామ వివాదాలు, భూ తగాదాలు, దాడులు, బెదిరింపులు, జూదం, మద్యం సేవించి అల్లర్లు...