రౌడీ ల భరతం పట్టండి.. ఎవరినీ ఉపేక్షించవద్దు.. జిల్లాలో రౌడీ యిజం ఎక్కడా ఉండకూడదు,జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్..
వై.ఎస్.ఆర్ కడప జిల్లా.ప్రజావాణి న్యూస్(ఏప్రిల్15)మహిళలు,బాలికలపై నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు తప్పవనే హెచ్చరిక ప్రజల్లోకి వెళ్ళాలి,అక్రమంగా మద్యం విక్రయించే (బెల్ట్) షాపులపై కఠినంగా వ్యవహరించాలి.బహిరంగ మద్యపానం పై దాడులు చేసి కేసులు నమోదు చేయాలి.అసాంఘిక కార్యకలాపాలైన మట్కా,క్రికెట్ బెట్టింగ్,గ్యాంబ్లింగ్ ఎక్కడా జరగకుండా కఠినంగా వ్యవహరించాలి.ప్రొద్దుటూరు పోలీస్ సబ్-డివిజన్ నేర సమీక్షా సమావేశంలో పోలీస్ అధికారులకు జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ దిశా నిర్దేశం,జిల్లాలో రౌడీయిజం ఎక్కడా ఉండకూడదని, రౌడీల ఆట కట్టించి శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ...