రోప్ స్కిప్పింగ్ రీజినల్ స్పోర్ట్స్ మీట్ ఘనంగా నిర్వహణ
ఘట్‌కేసర్, ఏప్రిల్ 24 (ప్రజావాణి): హైదరాబాద్ రీజన్ కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన రోప్ స్కిప్పింగ్ రీజినల్ స్పోర్ట్స్ మీట్ — 2025 కార్యక్రమం రెండు రోజుల పాటు పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ, ఎన్‌ఎఫ్‌సీ నగర్, ఘట్‌కేసర్‌లో ఘనంగా జరిగింది. హైదరాబాద్ రీజన్‌కు చెందిన 12 కేంద్రీయ విద్యాలయాల నుండి సుమారు 150 మంది విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు. అండర్–14, అండర్–17, అండర్–19 వయో విభాగాల్లో బాలబాలికలు తమ ప్రతిభను చాటుకున్నారు. కేవీఎస్ హైదరాబాద్ రీజన్ డిప్యూటీ కమిషనర్...