
కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే05) బద్వేల్ పట్టణంలోని నాలుగు రోడ్ల సెంటర్ నందు పట్టణ పరిశుభ్రత మరియు ప్రజా ఆరోగ్య పరిరక్షణ కోసం అవగాహన కార్యక్రమం నిర్వహించబడినది.ఈ సందర్భంగా బద్వేల్ మునిసిపల్ కమీషనర్ నరసింహారెడ్డి గారు మాట్లాడుతూ, రోడ్లపై ఉమ్మడం వలన పర్యావరణ కాలుష్యం పెరగడంతో పాటు వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉన్నదని తెలిపారు.బహిరంగ ప్రదేశాలలో పరిశుభ్రత పాటించడం గౌరవ సుప్రీంకోర్టు సూచించిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.పట్టణాన్ని శుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.