రోడ్లపై ఆక్రమణలు, షాపుల ముందు బోర్డులు, సామగ్రి, వ్యర్థాలు ఉంచరాదు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధింపు

మంగళగిరి (మే 17 ప్రజావాణి) తాడేపల్లి లో పరిశుభ్రత, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి వ్యాపారులు సహకరించాలి – కమీషనర్ అలీమ్ బాషా.మంగళగిరి–తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలోని గౌతమ బుద్ధ రోడ్‌తో పాటు, మెయిన్ బజార్, అన్ని ప్రధాన రహదారులు, వాణిజ్య ప్రాంతాలు మరియు మార్కెట్ ప్రాంతాలలో రోడ్లను ఆక్రమిస్తూ షాపుల ముందు బోర్డులు, ఫ్లెక్సీలు, వాహనాలు, మరమ్మత్తు సామగ్రి, టేబుళ్లు, కుర్చీలు మరియు ఇతర వస్తువులు ఉంచుతున్న వ్యాపార సంస్థల యజమానులకు మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ కమీషనర్ తీవ్ర హెచ్చరిక జారీ...