prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 May 2026, 2:32 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

రోడ్లపై ఆక్రమణలు, షాపుల ముందు బోర్డులు, సామగ్రి, వ్యర్థాలు ఉంచరాదు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధింపు

మంగళగిరి (మే 17 ప్రజావాణి) తాడేపల్లి లో పరిశుభ్రత, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి వ్యాపారులు సహకరించాలి – కమీషనర్ అలీమ్ బాషా.మంగళగిరి–తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలోని గౌతమ బుద్ధ రోడ్‌తో పాటు, మెయిన్ బజార్, అన్ని ప్రధాన రహదారులు, వాణిజ్య ప్రాంతాలు మరియు మార్కెట్ ప్రాంతాలలో రోడ్లను ఆక్రమిస్తూ షాపుల ముందు బోర్డులు, ఫ్లెక్సీలు, వాహనాలు, మరమ్మత్తు సామగ్రి, టేబుళ్లు, కుర్చీలు మరియు ఇతర వస్తువులు ఉంచుతున్న వ్యాపార సంస్థల యజమానులకు మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ కమీషనర్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు.ప్రత్యేకంగా మెకానిక్ షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఆటోమొబైల్ షాపులు, వెల్డింగ్ షాపులు, కిరాణా దుకాణాలు మరియు ఇతర వ్యాపార సంస్థలు తమ వ్యాపార అవసరాల పేరుతో రహదారులను ఆక్రమించడం వల్ల ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని అధికారులు గుర్తించారు. దీనివల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటమే కాకుండా పాదచారులు, వాహనదారులు మరియు అత్యవసర సేవల వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కావున, అన్ని వ్యాపార సంస్థల యజమానులు వెంటనే తమ షాపుల ముందు ఉంచిన బోర్డులు, వస్తువులు, మరమ్మత్తు సామగ్రి మరియు ఇతర ఆక్రమణలను తొలగించి, వాటిని షాపుల వెనుక భాగంలో లేదా అనుమతించబడిన ప్రదేశాలలో మాత్రమే ఉంచవలెనని తెలియచేయడమైనది.అలాగే షాపుల ముందు చెత్త వేయడం, వ్యర్థాలను రోడ్లపై పారేయడం మరియు డ్రైన్లలో ప్లాస్టిక్ వ్యర్థాలు, ఆహార అవశేషాలు, ఆయిల్ వ్యర్థాలు, ఇతర వ్యర్ధాలు వేయడం పూర్తిగా నిషేధించబడినది. ఈ చర్యల వల్ల డ్రైన్లు మూసుకుపోవడం, దుర్వాసనలు వ్యాపించడం, దోమలు పెరగడం, నీటి నిల్వ సమస్యలు ఏర్పడుతున్నవి. కావున ప్రతి వ్యాపార సంస్థ తమ షాపుల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు, తడి మరియు పొడి చెత్తను వేర్వేరుగా మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి మాత్రమే అందజేయాలని తెలియ చేయడమైనది.నగర పాలక సంస్థ అధికారుల ఆదేశాలను ఉల్లంఘిస్తూ రోడ్లపై ఆక్రమణలు కొనసాగించినా, చెత్తను రోడ్లపై లేదా డ్రైన్లలో పారేసినా సంబంధిత షాపులపై భారీ జరిమానాలు విధించబడటమే కాకుండా, మున్సిపల్ చట్టాల ప్రకారం సామగ్రిని స్వాధీనం చేసుకోవడం, షాపులను సీజ్ చేయడం మరియు ఇతర కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించరించడమైనది.గౌతమ బుద్ధ రోడ్ సహా మంగళగిరి–తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని ప్రధాన రహదారులను ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా, పరిశుభ్రంగా మరియు ఆక్రమణల రహితంగా ఉంచేందుకు ప్రతి వ్యాపారి పూర్తి సహకారం అందించాలని కోరడమైనది.