రోడ్డు సమస్యతో గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందులు

  రోడ్డు సమస్యతో గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందులు రామాయంపేట మండలం: కట్రీయాల్ తండా ప్రధాన రహదారి అధ్వానంగా మారడంతో తండా వసూలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని నెలలుగా రహదారి పూర్తిగా గుంతలమయంగా మారి, వర్షం పడితే బురదగా మారడంతో వాహనదారులు, పాదచారులు నరకయాతన అనుభవిస్తున్నారు. గ్రామ ప్రజలు ప్రతిరోజూ మండల కేంద్రానికి, పాఠశాలలకు, ఆసుపత్రులకు వెళ్లేందుకు ఈ రహదారినే ఉపయోగిస్తున్నారు. అయితే రోడ్డు దెబ్బతినడంతో ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు....