prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 7:08 am Digital Edition : PRAJA VANI

రోడ్డు వెడల్పు అనంతరం మధ్యలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి

*రోడ్డు వెడల్పు అనంతరం మధ్యలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి*

*మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్* 
షాద్ నగర్ ప్రజావాణి జూలై 25:
షాద్ నగర్ పట్టణ అభివృద్ధికి అన్ని వర్గాల ప్రజలు సహకరించవలసిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అభిప్రాయపడ్డారు. ఎప్పుడైతే రోడ్ల వెడల్పు, రవాణా వ్యవస్థ బలోపేతం అవుతుందో ఆ ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందినందుకు అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గ్రహించాలని కోరారు.బీముఖ్యంగా షాద్ నగర్ చౌరస్తా  విస్తరణ అభివృద్ధి కోసం గత ప్రభుత్వంలోనే నిధులు మంజూరు చేసినప్పటికీ వివిధ కారణాల చేత  రోడ్డు విస్తరణ పనులు జరగలేదని గుర్తు చేశారు. ఇటీవల కాలంలో రోడ్డు విస్తరణ పనులు చేస్తామని వెలువడుతున్న వార్తలు నేపథ్యంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని రోడ్డు విస్తరణ చేపట్టిన అనంతరం సర్కిల్ (మద్యన)ఏర్పాటు చేయాలని  అభిప్రాయపడ్డారు. స్థానికుల, పట్టణ వ్యాపారుల అభిప్రాయాల మేరకు వీలైనంత ఎక్కువగా రోడ్డు విస్తరణ చేస్తే సౌలభ్యంగా ఉంటుందని సూచించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై  ప్రభుత్వంతోపాటు ప్రజా ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ చూపవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు..