రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ఘట్‌కేసర్, ఆగస్టు 6: ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 26వ తేదీ రాత్రి సుమారు 10:30 గంటలకు ఇస్మాయిల్‌ఖాన్‌గూడ, పోచారంకు చెందిన కొండకళ్ళ మహేష్ (37), తండ్రి సత్తయ్య, తన హోండా యాక్టివా ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వస్తుండగా ఘట్‌కేసర్‌లోని ఔషాపూర్ ఫార్చూన్ కీర్తి వెంచర్ సమీపంలో వాహనం అదుపు తప్పి స్వయంగా జారి పడింది. ఈ ప్రమాదంలో...