అన్నమయ్య జిల్లా ప్రజావాణి (ఏప్రిల్20) రాజంపేట మండలం పోలి చెరువు కట్టపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ కీర్తిపాటి సుధాకర్ రాజు (56) మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న ఆయన డివైడర్‌ను ఢీకొనడంతో ఘటన చోటుచేసుకుంది.ప్రస్తుతం చిట్వేల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సుధాకర్ రాజు, గతంలో మన్నూరు, రాజంపేట పోలీస్ స్టేషన్లలో పనిచేశారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మృతి పట్ల సహచర పోలీసు సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు