రైల్వేల్లో పోస్టుల కోతపై ఏఐవైఎఫ్ ఆందోళన – మే 8న రైల్ నిలయం ముట్టడి

ఘాట్ కేసర్ , మే 4 (ప్రజావాణి):   రైల్వే శాఖలో పోస్టుల తగ్గింపు నిర్ణయంపై అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) తెలంగాణ రాష్ట్ర సమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత రైల్వే బోర్డు ఇటీవల ప్రకటించిన “ మ్యాన్ పవర్ రేషనలైజేషన్ 2026–27” ప్రకారం సుమారు 2 శాతం పోస్టులు (29,608) తగ్గించే చర్యలు తీసుకోవడం యువత భవిష్యత్తుకు విఘాతం కలిగిస్తుందని విమర్శించింది. హిమాయత్‌నగర్‌లో జరిగిన సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ, ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర...