రైతు సంక్షేమానికి ప్రాధాన్యం – రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా రైతు వారోత్సవాలు
ఘట్కేసర్, మే 4 (ప్రజావాణి): తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రైతు వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మే 4 నుంచి మే 9 వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమాలు మండల, నియోజకవర్గ స్థాయిలోని రైతు వేదికల్లో జరుగుతున్నాయి. “రైతు సంక్షేమం – నేల ఆరోగ్యం మన బాధ్యత” అనే ప్రధాన నినాదంతో ఈ వారోత్సవాలు కొనసాగుతున్నాయి. రైతుల భవిష్యత్తుకు పునాది అయిన నేల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ...