రైతును రాజుని చేయడమే లక్ష్యం
గోల్డెన్ సీడ్ఇంటర్నేషనల్ సంస్థ ఎండి.ప్రభాకర్ రెడ్డి
హైదరాబాద్,ఏప్రిల్ 18 (ప్రజావాణి):
రైతుల ప్రయోజనాల కోసమే ఎప్పటికప్పుడు కొత్త రకాల విత్తనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని గోల్డెన్ సీడ్ ఇంటర్నేషనల్ సంస్థ ఎం.డి. ప్రభాకర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన డీలర్ల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా సంస్థ కొత్తగా సర్పంచ్, ఆమనీ గోల్డ్, గోల్డెన్ 99 రకాల వరి, మొక్కజొన్న విత్తనాలను ఆవిష్కరించింది. రైతులకు అధిక దిగుబడి రావడంతో పాటు తెగుళ్లను తట్టుకునే లక్షణాలు ఉన్న వంగడాలను అభివృద్ధి చేస్తున్నామని ఆయన చెప్పారు.సర్పంచ్ దొడ్డు రకం వరి విత్తనాలు సుమారు 35 నుండి 40 క్వింటాళ్ల వరకు దిగుబడి ఇస్తాయని, ఆమనీ గోల్డ్ సన్న రకం వరి 30 నుండి 35 క్వింటాళ్ల వరకు దిగుబడి ఇస్తుందని వివరించారు. అలాగే రాయల్ 99 మొక్కజొన్న విత్తనాలు తక్కువ నీటి వసతిలోనే సుమారు 30 క్వింటాళ్ల దిగుబడి ఇస్తాయని తెలిపారు.గోల్డెన్ సీడ్ సంస్థ కేవలం ఆర్థిక లాభాలకే పరిమితం కాకుండా రైతులు, డీలర్ల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోందని ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పలు జిల్లాల డీలర్లు తదితరులు పాల్గొన్నారు.