prajavaani.net
Newspaper Banner
Date of Publish : 31 March 2026, 3:49 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

రైతుల గోడు ప్రభుత్వానికి పట్టదా! -కాకాణి”*

SPSR నెల్లూరు జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు ప్రజావాణి న్యూస్(మార్చి31) నెల్లూరు జిల్లాలో పలు ప్రాంతాలలో పర్యటించి రైతులు ఆరబెట్టుకున్న ధాన్య రాశులను పరిశీలించి,ధాన్యం అమ్మకాలలో రైతులు ఎదుర్కొంటున్న కష్ట,నష్టాల గురించి చర్చించిన మాజీ మంత్రివర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు “డా”కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు కల్లాల్లో ఆరబెట్టుకుంటున్న ధాన్యాన్ని రైతులు, స్థానికులు,వైఎస్ఆర్ సీపీ నాయకులతో కలిసి పరిశీలించిన -కాకాణి కల్లాల్లో ఆరబెట్టుకుంటున్న ధాన్యానికి గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నామంటూ కాకాణి ఎదుట తీవ్ర మనస్థాపానికి గురైన రైతులు కూటమిపాలనలో మాటలు చెప్పే నేతలు తప్ప,రైతుల బాధలు పట్టించుకునే నాధుడే కరువయ్యారంటూ, తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన రైతులు జిల్లాలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటనతో ఒరిగిందేమీ లేదంటూ పెదవి విరిచిన రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకుని,కొనే నాధుడు లేక, ఇబ్బందులు పడుతున్న, దైన్య స్థితిని చూసి చలించిన కాకాణి కూటమి పాలనలో అన్ని విధాల నష్టపోతున్నామని వాపోయిన రైతులురీ సర్వే పేరిట కూడా కూటమి ప్రభుత్వం తమను దగా చేస్తుందని,రైతులను వదిలిపెట్టి ,సంబంధంలేని వ్యక్తుల పేర్లు నమోదు చేసి తమను తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నారంటూ భావోద్వేగానికి గురైన రైతులు జగన్మోహన్ రెడ్డి గారి పాలనే భేష్ అంటున్న రైతులు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అర్హులైన వారందరికి రైతు భరోసాతో పాటు ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించారంటూ గుర్తు చేసుకుంటున్న రైతులు రైతులమంతా తిరిగి జగన్ మోహన్ రెడ్డి గారి పాలన రావాలని ఎదురుచూస్తున్నట్లు వెల్లడికాకాణి స్క్రోలింగ్ పాయింట్స్ ప్రస్తుతం మార్కెట్‌లోకి ధాన్యం విపరీతంగా వస్తోంది, కానీ రైతులు తమ పంటను ఆరబెట్టుకోవడానికి మరియు నిల్వ చేసుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు రైతులు ఇప్పటికే యూరియా కొరత మరియు సాగునీరు సరిగ్గా అందక ఎన్నో ఇబ్బందులు పడి పంటలు పండిస్తే, తీరా పంట చేతికి వచ్చాక మద్దతు ధర లేక అష్ట కష్టాలు పడుతున్నారు, కౌలు రైతుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది ప్రభుత్వం ధాన్యానికి ₹20,300 ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించింది కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది నెల్లూరు జిల్లాకు సంబంధించి సాధారణంగా ఒక పుట్టి 850 కేజీలు ఉంటే ,తేమ శాతం పేరిట ప్రస్తుతం దానిని 940 కేజీలుగా మార్చి, అదనంగా దోచుకుంటున్నారు,నిన్న మంత్రి నాదెండ్ల మనోహర్ గారు జిల్లాలో పర్యటించారు,అధికారులు, నాయకులు,కేవలం తమకు అనుకూలమైన రైతుల వద్దకే తీసుకెళ్లి అంతా బాగుందని అనిపించి పంపించేశారు,స్థానిక ప్రజా ప్రతినిధులు రైతుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాల్సింది పోయి,వాస్తవాలను దాచిపెట్టి ప్రభుత్వానికి మచ్చ పడకుండా చూసుకోవడానికే నేతలు ప్రాధాన్యత ఇవ్వడం తో రైతులకు ఇది పెద్ద ద్రోహమే అవుతుంది,సాధారణంగా ఒక పుట్టి (850) కేజీలు ఉండాలి,కానీ ప్రస్తుతం 940 కేజీల వరకు అంటే దాదాపు 90 నుండి 100 కేజీలు అదనంగా తీసుకుంటున్నారు,దళారులు,వ్యాపారులు కుమ్మక్కై పుట్టి (850)రూ.17, వేల నుండి 16,500 రూపాయలకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు,దీనివల్ల రైతులు భారీగా నష్టపోతున్నారు,ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని చెబుతున్నా,క్షేత్రస్థాయిలో అవి ఎక్కడా కనిపించడం లేదు రైతులకు ధాన్యం నిల్వ చేయడానికి గోనె సంచులు లేవు, రవాణా సౌకర్యాలు కరువయ్యయి,గతంలో వరి కోత ఖర్చు ₹2,200 ఉంటే,ఇప్పుడు అది ₹2,600 కు చేరింది, యూరియా ధరలు కూడా బాగా పెరిగాయి గిట్టుబాటు ధర లేక రైతులు ఆవేదన చెందుతున్నారు సోమిరెడ్డి రైతుల పక్షాన నిలబడకుండా మిల్లర్లతో కుమ్మక్కయ్యాడు సోమిరెడ్డి రెండు రోజుల క్రితం మిల్లర్ల వ్యవహార శైలి బాగాలేదంటూ తీవ్ర విమర్శలు గుప్పించాడు, కలెక్టరేట్ లో నిన్న జరిగిన సమావేశంలో తాను మిల్లర్లతో మాట్లాడానని మిల్లర్లు కచ్చితంగా 940 కేజీలు అనగా 90 కేజీలు తరుగు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారని చెప్పడంతో,మిల్లర్లతో మీరెందుకు మాట్లాడారంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా సోమిరెడ్డిని మందలించినట్లు తెలుస్తుంది రైతులు పండించిన పంటను అమ్ముకోలేక,వర్షాలకు తడిసిపోతుందేమోనన్న భయంతో, దళారులకు తక్కువ ధరకే ధాన్యాన్ని తెగ నమ్ముకుంటున్నారు,రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది తక్షణమే ప్రభుత్వం స్పందించి మద్దతు ధరతో ధాన్యం సేకరించాలి,అధికారులు ఫోన్ లకు అందుబాటులో ఉండటం లేదు, ధాన్యం కొనుగోలుపై వారికి సరైన అవగాహన లేదు.జిల్లా లో ధాన్యానికి మద్దతు ధర రాకపోవడంతో ఆత్మహత్యలే శరణ్యం అనేలా రైతుల పరిస్థితులు ఉన్నాయి,గతంలో జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో పుట్టి (850) కేజీలు,మద్దతు ధర కంటే 25% అధికంగా (దాదాపు ₹24,000 -₹25,000) వేల రూపాయలు రైతులకు లభించేది ప్రస్తుతం మద్దతు ధర కంటే 25% నుండి 35% తక్కువ ధరకు రైతులు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది, దీనివల్ల రైతులు భారీగా నష్టపోతున్నారు నిన్న జిల్లాకు వచ్చిన మంత్రి పర్యటన కేవలం భ్రమ సృష్టించడానికే తప్ప, క్షేత్రస్థాయిలో రైతులకు ఒరిగిందేమీ లేదు గతంలో జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో రైతులకు అన్ని విధాలా అండగా నిలిచాం ‘రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది’ అనే నినాదంతో పని చేశాం కూటమి ప్రభుత్వం’అన్నదాత సుఖీభవ’ కింద ఇస్తామన్న ఆర్థిక సాయం ఒక సంవత్సరం ఎగనామం పెట్టడంతోపాటు సక్రమంగా సకాలంలో అందించడం లేదు జిల్లా లో మార్కెట్‌లోకి సుమారు 25 లక్షల టన్నుల పైగా ధాన్యం వస్తుందని అంచనా ఉంటే, ప్రభుత్వం కేవలం 1.5 లక్షల టన్నులు మాత్రమే సేకరిస్తామని చెప్పడం హాస్యాస్పదం  మంత్రి గారు మరో 50 వేల టన్నులు పెంచుతామని చెప్పినా, అది మొత్తం దిగుబడిలో చాలా తక్కువ (దాదాపు 6-8%) శాతం మాత్రమే సొసైటీ ఛైర్మన్ లు రైతులకు అండగా ఉండాల్సింది పోయి,దళారులుగా మారి తక్కువ ధరకు ధాన్యం కొంటూ,పాస్ బుక్కులు తీసుకుని రైతులకు అందాల్సిన కనీస మద్దతు ధర దక్కకుండా తామే దోచుకుంటున్నారు రైతుల కు అందించాల్సిన గోనె సంచుల కొరత తీవ్రంగా ఉంది,రవాణా సౌకర్యాలు కూడా కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమైంది ప్రతి గింజా కొంటామని మాట ఇచ్చిన కూటమి ప్రభుత్వం, ఆచరణలో విఫలమైంది తక్షణమే కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో తెరిచి, చివరి గింజ వరకు మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిందే,జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతుల పక్షాన నిలబడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది,రైతుల కష్టాలను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తాం, రైతులకు గిట్టుబాటు ధర దక్కే వరకు విశ్రమించం