బెజ్జంకి, మే 20 (ప్రజావాణి)
రైతు పండించిన వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ బెజ్జంకి మండల అధ్యక్షులు లింగాల శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లింగాల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిలువేరి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డిలతో కలిసి సందర్శించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో రైతులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. రైతులు తీసుకొచ్చిన వడ్లను త్వరితగతిన కొనుగోలు చేయాలని మిల్లర్లతో మాట్లాడినట్లు చెప్పారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వంతోనే రైతులకు న్యాయం జరుగుతుందని, ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దని,రైతులు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కరవేణి పోచయ్య, మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య, డైరెక్టర్ బోనాల మల్లేశం, బోనగం రమేష్, ఐలేని శ్రీనివాస్ రెడ్డి, రొడ్డ మల్లేశం, బైర సంతోష్ తదితరులు పాల్గొన్నారు.