రేషన్ కార్డుల ఈ-కేవైసీకి మరో అవకాశం.. ఆగస్టు 31 వరకు గడువు పొడిగింపు
నడికూడ ప్రజవాని జూలై 31
నడికూడ: రేషన్ కార్డుల ఈ-కేవైసీ ఈ కేవైసీ పూర్తి చేయని లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఊరట కల్పించింది. ఈ-కేవైసీ పూర్తి చేసుకునేందుకు గడువును ఆగస్టు 31, 2026 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, ఎస్‌ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పలువురు లబ్ధిదారులు ఈ-కేవైసీ పూర్తి చేసుకోలేకపోయారని ప్రభుత్వం గుర్తించింది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గడువును మరో నెల రోజుల పాటు పొడిగించినట్లు అధికారులు తెలిపారు.
ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల సివిల్ సప్లై అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. ఇంకా ఈ-కేవైసీ చేయించుకోని రేషన్ కార్డుదారులు సమీపంలోని రేషన్ దుకాణం లేదా సంబంధిత కేంద్రంలో బయోమెట్రిక్ ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు.
అలాగే, లబ్ధిదారుల సౌకర్యార్థం ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యాన్ని తీసుకునే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.