prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 June 2026, 8:39 am Digital Edition : RAJASHEKARREDDY

రేపే బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షిణ

 

బెజ్జంకి,జూన్ 24 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని ఏకాశీల కొండపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం ఉదయం 5:30 గంటలకు గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ పూజారి శేషం మధుసూదనాచార్యులు, బెజ్జంకి గ్రామ సర్పంచ్ బొల్లం శ్రీధర్ తెలిపారు.ఈ పవిత్ర గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని వారు కోరారు. కార్యక్రమం విజయవంతం కావడానికి ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.