రేపు సాయంత్రం బెజ్జంకి, కోహెడ మండలాల్లో రెండు గంటల విద్యుత్ అంతరాయం – ఏడిఈ సుధీర్ బాబు

బెజ్జంకి, జూలై 8 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా పరిధిలోని 132/33 కేవీ శనిగారం సబ్‌స్టేషన్‌లో నిర్వహణ (మెయింటెనెన్స్) పనులు చేపట్టనున్న నేపథ్యంలో రేపు (జూలై 9) సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు బెజ్జంకి, కోహెడ మండలాల పరిధిలోని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ ADE ఏ. సుధీర్ బాబు తెలిపారు.నిర్వహణ పనులు పూర్తయ్యే వరకు రెండు గంటల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన విజ్ఞప్తి...