రేపు తవనంపల్లి లో ప్రజా దర్బార్ కార్యక్రమం.
తవణంపల్లి ఏప్రిల్ 16 ప్రజావాణి : తవణంపల్లి మండల కేంద్రంలోని ప్రజా దర్బార్ నందు ప్రజలు తమ సమస్యలను నేరుగా తెలియజేసే కార్యక్రమం నిర్వహించనున్నట్లు పూతలపట్టు శాసనసభ్యుల కార్యాలయం నుండి తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా తవణంపల్లి మండలంలో పూతలపట్టు ఎమ్మెల్యే డా. కలికిరి మురళీమోహన్ ప్రజా దర్బార్ లో ఉదయం 8 గంటలకు మండలంలోని ఎగువ మోదలపల్లి పంచాయతీ గోపాలమిత్ర సెంటర్ నందు వ్యవసాయ మార్కెట్ కమిటీ బంగారు పాల్యం ఆధ్వర్యంలో పశు సంవర్ధక శాఖ వారిచే, ఉచిత పశు వైద్య శిబిరంలో పాల్గొంటారని, అలాగే 10 గంటలకు మండల పరిషత్ కార్యాలయము నందు ఎమ్మెల్యే పాల్గొనే ప్రజా దర్బార్ లో ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చి నేరుగా తెలియజేసే అవకాశం అనంతరం సమస్యలకు, తక్షణమే పరిష్కార మార్గాలు, పరిష్కరించబడతాయని, తెలియజేశారు. ప్రజా దర్బార్ లో పాల్గొనే ప్రజలు తమ సమస్యలను దరఖాస్తులో స్పష్టంగా వ్రాసుకుని సంబంధిత పత్రాలు తప్పనిసరిగా జతపరచి తీసుకురావాలని తెలిపారు. మండలంలోని ప్రజలందరూ ఆవకాశాన్ని సద్వియం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు.