prajavaani.net
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 1:50 pm Digital Edition : RRAJUREGONDA REGONDA

రేగొండ మండల కేంద్రంలో మద్యపాన నిషేధం

*రేగొండ మండల కేంద్రంలో మద్యపాన నిషేధం*

*బెల్టు షాపులు, గుడుంబా సెంటర్లు బంద్ చేయాలని తీర్మానం*

*ఎస్సై దాసరి సుధాకర్ కు తీర్మాన ప్రతిని అందజేసిన పాలకవర్గం*

 

*రేగొండ, ఆగస్టు 4:* గ్రామ ప్రజల ఆరోగ్యం, యువత భవిష్యత్తును కాపాడడం, గ్రామంలో శాంతిభద్రతలు కాపాడడం లక్ష్యంగా రేగొండ మండల కేంద్రంలో _మద్యపాన నిషేధం_ అమలు చేయాలని గ్రామ పంచాయతీ సర్పంచ్ *వారణాసి మౌనిక* ఆధ్వర్యంలో తీర్మానం చేశారు.

 

మంగళవారం జరిగిన గ్రామ పంచాయతీ ప్రత్యేక సమావేశంలో గ్రామ పరిధిలోని *అన్ని బెల్టు షాపులు మరియు గుడుంబా సెంటర్లను వెంటనే మూసివేయాలని* ఏకగ్రీవంగా నిర్ణయించారు.

 

ఈ తీర్మాన ప్రతిని *రేగొండ ఎస్సై దాసరి సుధాకర్* గారికి సర్పంచ్ వారణాసి మౌనిక, పంచాయతీ సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు అందజేశారు. గ్రామంలో అక్రమ మద్యం అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, పోలీసు గస్తీని పెంచాలని వారు కోరారు.

 

*తీర్మానంలోని ముఖ్య అంశాలు:*

1. గ్రామ పరిధిలో బెల్టు షాపులు, గుడుంబా విక్రయాలపై పూర్తి నిషేధం

2. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసు చర్యలు

3. మద్యపాన దుష్ప్రభావాలపై యువతకు, మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహణ

 

ఈ నిర్ణయాన్ని గ్రామ ప్రజలు, ముఖ్యంగా మహిళలు హర్షం వ్యక్తం చేశారు. మద్యపాన రహిత గ్రామంగా రేగొండను తీర్చిద్దడానికి అందరూ సహకరించాలని సర్పంచ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దండ్రే రాజ్ కుమార్, మహిళా సంఘం సిఏలు రేగూరి రజిత, మార్క సుమలత, వార్డు సభ్యులు పల్లె కల్పన, మేకల రాజు, పూజారి ప్రవళిక, మైస సురేందర్, అన్నారపు వెంకన్న, గ్రామస్తులు వారణాసి అజయ్, కూరాకుల మల్లయ్య, చిన్నాల ధనుంజయ్, కారోబార్ ముష్కే రమేష్ తది తరులు పాల్గొన్నారు.