రేకొండ గ్రామ పంచాయతీలో అక్రమాలపై జిల్లా కలెక్టర్‌కు వినతి
రేకొండ గ్రామ పంచాయతీలో అక్రమాలపై జిల్లా కలెక్టర్‌కు వినతికరీంనగర్, జూలై 13 (మన ప్రజావాణి): చిగురుమామిడి మండలం రేకొండ గ్రామ పంచాయతీలో జరుగుతున్నట్లు ఆరోపిస్తున్న అక్రమాలు, నిధుల దుర్వినియోగం, పారదర్శకత లోపం, గ్రామసభల నిర్వహణలో నిర్లక్ష్యం తదితర అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ రేకొండ గ్రామ ప్రజలు సోమవారం జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణి కార్యక్రమంలో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.ఫిర్యాదులో గ్రామసభలను చట్టప్రకారం నిర్వహించడం లేదని, గ్రామసభ తీర్మానాలు ప్రజలకు వెల్లడించడం లేదని, పంచాయతీ ఆదాయం–వ్యయ వివరాలు, జేసీబీ పనులు, ట్రాక్టర్ వినియోగం, చెట్ల...