
ఎరుపు రంగు దుస్తులతో చిన్నారుల సందడి… ఆకట్టుకున్న ప్రదర్శనలు…
మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి): కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని చాణక్య ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో చిన్నారులు “రెడ్ కలర్ డే”ను ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల కరస్పాండెంట్ ఆడెపు రవీందర్ ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు ఎరుపు రంగు ప్రాధాన్యతను వివరించారు. ట్రాఫిక్ లైట్లలో రెడ్ సిగ్నల్ వచ్చినప్పుడు ఆగాల్సిన అవసరాన్ని సూచిస్తుందని, అలాగే అత్యవసర పరిస్థితులను తెలియజేసే సంకేతంగా ఎరుపు రంగును ఉపయోగిస్తారని తెలిపారు.ఈ సందర్భంగా నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులు ఎరుపు రంగుకు సంబంధించిన పండ్లు, వస్తువులు, సంఖ్యలు తదితరాలను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. ఎరుపు రంగు దుస్తులతో పాల్గొన్న చిన్నారులు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.