రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు డిమాండ్ ఏప్రిల్ 21న భారీ ధర్నా

బెజ్జంకి,ఏప్రిల్ 18 (ప్రజావాణి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 5000 కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా రెడ్డి జేఏసీ జిల్లా అధ్యక్షులు ఐలేని మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు.ఈ ధర్నాకు పెద్ద సంఖ్యలో ప్రజలు, సంఘ సభ్యులు హాజరుకావాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గ్రామ స్థాయిలో విస్తృతంగా చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా...