prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 April 2026, 1:51 am Digital Edition : RAJASHEKARREDDY

రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు డిమాండ్ ఏప్రిల్ 21న భారీ ధర్నా

బెజ్జంకి,ఏప్రిల్ 18 (ప్రజావాణి)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 5000 కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా రెడ్డి జేఏసీ జిల్లా అధ్యక్షులు ఐలేని మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు.ఈ ధర్నాకు పెద్ద సంఖ్యలో ప్రజలు, సంఘ సభ్యులు హాజరుకావాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గ్రామ స్థాయిలో విస్తృతంగా చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా బెజ్జంకి మండలం గుగ్గిళ్ళ, తిమ్మయాపల్లి గ్రామంలో రెడ్డి సంఘ నాయకులను కలిసి కరపత్రాలను విడుదల చేశారు. ధర్నా విజయవంతం కోసం అందరూ సహకరించాలని జేఏసీ నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో గుగ్గిళ్ల, తిమ్మాయపల్లి రెడ్డి సంఘం సభ్యులు పాల్గొన్నారు.