రెటినోవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘట్‌కేసర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఉచిత వైద్య శిబిరం
ఘట్‌కేసర్, జూలై 15: రెటినోవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘట్‌కేసర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి మేడం ఆదేశాల మేరకు, డీసీపీ వి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో, ఏసీపీ సంపత్ కుమార్ పర్యవేక్షణలో ఈ ఆరోగ్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో ప్లానెట్ ఆప్టిక్స్ వైద్య బృందం కంటి పరీక్షలు నిర్వహించగా, శ్రీకార హాస్పిటల్ వైద్యులు సాధారణ ఆరోగ్య పరీక్షలు, రక్తపోటు (బీపీ), రక్తంలో చక్కెర స్థాయిలు (జీఆర్‌బీఎస్), ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. అలాగే క్లోవ్...